సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్ వదిలిన ‘ఖిలాడి’ డైరెక్టర్

ABN, First Publish Date - 2021-09-22T22:16:22+05:30

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై.. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మౌనం’. పారా సైకాలజీ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై.. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మౌనం’. పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అనేది ట్యాగ్‌లైన్. ఎమ్.ఎమ్. శ్రీలేఖ సంగీతం అందిస్తోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా ‘ఖిలాడి’ దర్శకుడు రమేష్ వర్మ విడుదల చేశారు. అనంతరం ట్రైలర్ చాలా బాగుందని, మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో నా మిత్రుడు మురళి నటించిన ఈ ‘మౌనం’ చిత్రం మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలిపారు.


ఈ సందర్భంగా నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ.. ‘‘మౌనం.. కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్‌గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లరే ఈ చిత్రం. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన రమేష్ వర్మగారికి మా చిత్రయూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం..’’ అన్నారు.

Updated Date - 2021-09-22T22:16:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!