దొరస్వామి రాజు మృతికి సీఎం కేసీయార్ సంతాపం!

ABN , First Publish Date - 2021-01-18T17:52:32+05:30 IST

ప్రముఖ నిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్స్ అధినేత దొరస్వామి రాజు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు

దొరస్వామి రాజు మృతికి సీఎం కేసీయార్ సంతాపం!

ప్రముఖ నిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్స్ అధినేత దొరస్వామి రాజు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం పేర్కొన్నారు. 


దొరస్వామి రాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దొరస్వామిరాజు ఈ రోజు (సోమవారం) ఉదయం బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 

Updated Date - 2021-01-18T17:52:32+05:30 IST