సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

KBR Park వద్ద నటి చౌరాసియాపై దుండగుడి దాడి

ABN, First Publish Date - 2021-11-15T13:42:33+05:30

కేబీఆర్‌ పార్క్‌ దగ్గర నటి చౌరాసియాపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నటి చౌరాసియాపై దాడికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌:  నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చౌరాసియాపై దాడి చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని ఆకతాయిలు ఆమెపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ పెనుగులాటలో నటి తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఓ ఆకతాయి ఆమె ముఖంపై పిడిగుద్దులు, బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న 8 ప్లస్ ఫోన్, నగలు, నగదు తీసుకుని వారు పరారయ్యారు. ఈ ఘటనపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నటి చౌరాసియాను ఆస్పత్రికి తరలించిన మిత్రులు, స్థానికులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ దుండగులు ఎవరు..? ఎందుకు దాడి చేశారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-11-15T13:42:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!