సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిరంజీవి టైటిల్‌తో కార్తికేయ

ABN, First Publish Date - 2021-06-20T19:04:37+05:30

కార్తికేయ హీరోగా వినాయక్ శిష్యుడు శ్రీ సిరిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తికేయ కొత్త చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1990లో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తికేయ చేస్తోన్న ‘రాజా విక్రమార్క’ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.టైటిల్‌తో పాటు సినిమాలో హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రంలో కార్తికేయ ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా కనిపించనున్నారు. తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతోంది.  

Updated Date - 2021-06-20T19:04:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!