కార్తికేయ: అదే నాకు అడ్వాంటేజ్‌

ABN , First Publish Date - 2021-11-09T23:06:38+05:30 IST

తన బాడీ, ఫిజిక్‌ వల్లే మూడు సినిమా అవకాశాలొచ్చాయని ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న విడుదల కానున్న సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘నా యాక్టింగ్‌ స్కిల్స్‌ ఏమీ పట్టించుకోకుండా నాకు మంచి పిజిక్‌ ఉందని అజయ్‌ భూపతి ఆర్‌ఎక్స్‌100 అవకాశం ఇచ్చారు.

కార్తికేయ: అదే నాకు అడ్వాంటేజ్‌

తన బాడీ, ఫిజిక్‌ వల్లే మూడు సినిమా అవకాశాలొచ్చాయని ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న విడుదల కానున్న సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘నా యాక్టింగ్‌ స్కిల్స్‌ ఏమీ పట్టించుకోకుండా నాకు మంచి పిజిక్‌ ఉందని అజయ్‌ భూపతి ఆర్‌ఎక్స్‌100 అవకాశం ఇచ్చారు. ఆ విషయం ఆయనే చెప్పాడు. తర్వాత ‘గ్యాంగ్‌ లీడర్‌’కు అంతే!  దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌తో ‘నన్ను ఎందుకు తీసుకున్నారు?’ అని అడిగితే ‘నీకు మంచి బాడీ ఉంది’ ప్రతి నాయకుడి పాత్రకు ఫిట్‌ అవుతావ్‌ అనిపించింది. అందుకే తీసుకున్నా అన్నారు. ఇప్పుడు ‘వలిమై’లో కూడా అందుకే తీసుకున్నారు. సిక్స్‌ప్యాక్‌, బాడీ ఫిట్‌నెస్‌ వల్ల నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. దర్శకులు నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు. బాడీ ఉందని నన్ను తీసుకున్నానని చెప్పిన ముగ్గురు దర్శకులు... నా నటన చూసినప్పుడు, ఎమోషనల్‌ సీన్స్‌ చేసినప్పుడు, నటనలో ఇంటెన్స్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యామన్నారు. ఫిజిక్‌ ఉండటం నాకు అడ్వాంటేజ్‌ అయ్యింది. బాడీ అలా మెయింటైన్‌ చెయ్యడం కష్టమే. దాని వల్ల అవకాశాలు వస్తున్నప్పుడు పర్లేదు. కష్ట పడొచ్చు’’ అని ఆయన అన్నారు. 


Updated Date - 2021-11-09T23:06:38+05:30 IST