పక్కా యాక్షన్‌తో కంగనా.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , First Publish Date - 2021-01-18T17:51:02+05:30 IST

కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ థాకడ్ రిలీజ్ డేట్ ఖరారైంది. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

పక్కా యాక్షన్‌తో కంగనా.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ రీసెంట్‌గానే 'తలైవి' చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. అందులో ఒకటి 'ధాకడ్'‌. ఇది పక్కా యాక్షన్‌ మూవీ. ఇందులో కంగనా రనౌత్‌ ఏజెంట్‌ అగ్ని అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్ర యూనిట్‌ ఖరారు చేసింది.  ఈ ఏడాది అక్టోబర్‌ 1న 'ధాకడ్‌' సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. రజనీష్‌ రజి ఘాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దీపక్‌ ముకుత్‌, సోహైల్‌ మక్‌లాయ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల కోసం కంగనా రనౌత్‌ స్టంట్‌ మాస్టర్‌ బ్రెట్‌ చాన్‌ దగ్గర ప్రత్యేక శిక్షణను కూడా తీసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన కంగనా రనౌత్‌ త్వరలోనే యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌గా మారుతుందేమో చూడాలి. 



Updated Date - 2021-01-18T17:51:02+05:30 IST