#Kinnerasani trailer : ఇది కథ కాదు. ప్రతి అక్షరం నిజం
ABN , First Publish Date - 2021-12-30T17:31:13+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న మిస్టిక్ లవ్ స్టోరీ ‘కిన్నెరసాని’. ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను యస్.ఆర్.టీ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ‘అనుభవించు రాజా’ ఫేమ్ కాశిష్ ఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులోని సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తి్స్తున్నాయి. ఈసినిమాతో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్ధమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న మిస్టిక్ లవ్ స్టోరీ ‘కిన్నెరసాని’. ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను యస్.ఆర్.టీ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ‘అనుభవించు రాజా’ ఫేమ్ కాశిష్ ఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులోని సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తి్స్తున్నాయి. ఈసినిమాతో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నీ ముందున్న సముద్ర అలల్ని చూడు. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టున్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే’ అని కథానాయిక హీరో కళ్యాణ్ దేవ్ తో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. కొన్ని మిస్టిక్ విజువల్స్ తర్వాత ‘నాదగ్గర నువ్వేదో దాస్తున్నావని నాకర్ధమైంది.’ అనే కథానాయిక డైలాగ్ తో సినిమా సమ్ థింగ్ థ్రిల్లింగ్ అని అర్ధమవుతుంది. మొత్తం మీద ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అని చెప్పుకోవచ్చు. దానికి ‘కిన్నెరసాని’ అనే ఒక బుక్ రిలేటెడ్ గా ఉంటుంది. ‘నీకో రహస్యం చెప్పనా. ఇది కథ కాదు. ప్రతి అక్షరం నిజం.’ అనే డైలాగ్ మీద ట్రైలర్ ఎండ్ అవుతుంది. సత్యేదేవ్ ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా కళ్యాణ్ దేవ్ కు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.