కళామతల్లి చేదోడు
ABN, First Publish Date - 2021-06-10T06:08:34+05:30
‘‘సినీ కార్మికుల సమస్యలను ‘దిల్’ రాజుగారి దృష్టికి తీసుకువెళితే ‘ఏం కావాలన్నా నా మద్దతు ఉంటుంది’ అని ముందుకొచ్చారు...
‘‘సినీ కార్మికుల సమస్యలను ‘దిల్’ రాజుగారి దృష్టికి తీసుకువెళితే ‘ఏం కావాలన్నా నా మద్దతు ఉంటుంది’ అని ముందుకొచ్చారు. అలాగే, చదలవాడ శ్రీనివాసరావుగారు. వాళ్లిద్దరి థ్యాంక్స్’’ అని యలమంచిలి రవి అన్నారు. ‘కళామతల్లి చేదోడు’ పేరుతో బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో 600మంది మహిళా కార్మికులు, డ్రైవర్లు, జానియర్ ఆర్టిస్టులు ఒక్కొక్కరికీ రూ. 2500 విలువ గల నిత్యావసర సరుకులు అందించారు. ‘దిల్’ రాజు, చదలవాడ శ్రీనివాస రావు, యలమంచిలి రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘కొవిడ్ కారణంగా అందరికీ ఒకేసారి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయని తొలి విడతగా 600మందికి ఇచ్చాం. దశల వారిగా అందరికీ అందజేస్తాం. ఈ మంచి పనికి మాకు కొందరు పెద్దలు డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు. నేరుగా సూపర్ మార్కెట్లకు చెల్లించమని చెప్పాం’’ యలమంచిలి రవి వివరించారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.