ప్రెగ్నెన్సీపై స్పందించిన Kajal Aggarwal.. ఆ ఫీలింగే నన్ను భయపెడుతోంది

ABN , First Publish Date - 2021-11-09T17:31:29+05:30 IST

టాలీవుడ్‌తో పాటు సౌతిండియా సినీ పరిశ్రమల్లో ఫేమ్ ఉన్న కథానాయిక కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ గతేడాది బిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కూడా సినిమాలు చేస్తూ..

ప్రెగ్నెన్సీపై స్పందించిన Kajal Aggarwal.. ఆ ఫీలింగే నన్ను భయపెడుతోంది

టాలీవుడ్‌తో పాటు సౌతిండియా సినీ పరిశ్రమల్లో ఫేమ్ ఉన్న కథానాయిక కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ గతేడాది బిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కూడా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ ఇటీవల జోరు కొంచెం తగ్గించింది. దీంతో ఆమె గర్భవతి అయ్యిందని రూమర్స్ హల్‌చల్ చేశాయి. తాజాగా వీటిపై ఓ ఇంటర్వూలో స్పందించింది ఈ తార.


కాజల్ మాట్లాడుతూ..‘దీని గురించి ఇప్పుడే మాట్లాడటానికి ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేను దానిపై స్పందిస్తాను. నా చెల్లి నిషా అగర్వాల్ తల్లి కావడం చూసిన నాకు తల్లి కావడంపై విభిన్న రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూశాను. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా సోదరి కొడుకులు ఇషాన్, కబీర్‌ల సహవాసంలో నేను ఇప్పటికే తల్లిలా భావిస్తున్నాను. అయితే మరోవైపు ఇందుకు భిన్నమైన భావం కూడా కలుగుతోంది. ఒక్కోసారి తల్లి కావాలి అనే భావన నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నా’ని తెలిపింది. అంతేకాకుండా తను తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉమ’ గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక ఫీల్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ డ్రామా. ఈ లుక్ మేరీ పాపిన్స్‌ని గుర్తు చేస్తుంది, కానీ అది అలాంటిది కాదు. కథ చాలా భిన్నంగా ఉంటుంద’ని ఈ బ్యూటీ చెప్పింది.

Updated Date - 2021-11-09T17:31:29+05:30 IST