సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కిచ్చా సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN, First Publish Date - 2021-10-21T03:05:07+05:30

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ హీరోగా రూపొందిన చిత్రం ‘కే3 కోటికొక్కడు’. కన్నడలో ఈ చిత్రం విడుదలవ్వడమే కాకుండా.. కన్నడ పరిశ్రమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ హీరోగా రూపొందిన చిత్రం ‘కే3 కోటికొక్కడు’. కన్నడలో ఈ చిత్రం విడుదలవ్వడమే కాకుండా.. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజైన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల‌చేయ‌నున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. రీసెంట్‌గా చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.


ట్రైలర్ చూస్తుంటే.. సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఇంటర్ పోల్ అధికారి అప్తబ్ ఘోస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాని శపథం చేయడం వంటివి చూపించారు. ఇక సుదీప్ ఎంట్రీ  కచ్చితంగా విజిల్స్ పడేలా ఉంది. మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో సుదీప్‌కి జోడిగా నటించింది. ఈ ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. ఈ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్‌ను కచ్చితంగా అలరిస్తుందనేలా ట్రైలర్ ఉంది. గుడ్ సినిమా గ్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.



Updated Date - 2021-10-21T03:05:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!