సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జోష్‌లో ఉన్న జ్వాలా రెడ్డి..!

ABN, First Publish Date - 2021-03-19T21:08:06+05:30

మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నంది మంచి జోష్‌లో ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అన్న సినిమా తెరకెక్కింది. గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నంది మంచి జోష్‌లో ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అన్న సినిమా తెరకెక్కింది. గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజైన జ్వాలా రెడ్డి పాటతో తమన్నా ఒక ఊపు ఊపేసింది. వీలైనంతగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి కుర్రాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు గంతులేయించింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కోచ్ పాత్రలో గోపీచంద్, తమన్నా కనిపించనున్నారు. తెలంగాణ జట్టుకు కోచ్‌గా తమన్నా, ఆంధ్ర జట్టుకు కోచ్‌గా గోపీచంద్ ననటిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ  సినిమా ఏప్రిల్ 2న విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం తమన్నాతో డబ్బింగ్ చెప్పిస్తున్నాడు దర్శకుడు సంపత్ నంది.


తమన్నా తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. అందులోనూ తెలంగాణ యాసలో తమన్నా డబ్బింగ్ చెప్పడం ఇక్కడ విశేషం. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఇలానే తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అలానే తమన్నా కూడా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో డబ్బింగ్ థియేటర్ లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఒకటి తమన్నా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో తమన్నా డబుల్ ఎనర్జీతో మాంచి జోష్‌లో ఉనట్టు కనిపిస్తోంది. ఈ జోష్ చూస్తుంటే ఖచ్చితంగా సీటీమార్ సినిమాతో గ్యారెంటీగా హిట్ అందుకుంటుందని తెలుస్తోంది. ఇక తమన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. గుర్తుందా శీతాకాలం, నితిన్‌తో అంధాదున్ తెలుగు రీమేక్, దటీజ్ మహాలక్ష్మి, ఎఫ్ 3 సినిమాలు చేస్తోంది.  

Updated Date - 2021-03-19T21:08:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!