లక్ష్యం వైపు పయనం
ABN , First Publish Date - 2021-11-29T11:12:51+05:30 IST
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు నిర్మాతలు...

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. డిసెంబరు 10న విడుదల అవుతోంది. ‘‘విలు విద్య నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకోసం నాగశౌర్య ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఆయన ఎనిమిది పలకల దేహంతో కనిపిస్తారు. ఇది వరకెప్పుడూ చూడని సరికొత్త గెటప్‌లో నాగశౌర్య ఆశ్చర్యపరుస్తారు. ఆయన పాత్రలో రెండు విభిన్న పార్వ్శాలు ఉంటాయి. డిసెంబరు 1న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. మంచి కథ, నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల నైపుణ్యం ఈ చిత్రాన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయ’’ని నిర్మాతలు తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేద్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.