అట్లా్‌సగా జెన్నిఫర్‌ లోపెజ్‌

ABN , First Publish Date - 2021-06-17T10:36:19+05:30 IST

కృత్రిమ మేధ వల్ల తలెత్తే విపత్కర పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించే అట్లా్‌సగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు హాలీవుడ్‌ నటి, పాప్‌ గాయని...

అట్లా్‌సగా జెన్నిఫర్‌ లోపెజ్‌

కృత్రిమ మేధ వల్ల తలెత్తే విపత్కర పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించే అట్లా్‌సగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు హాలీవుడ్‌ నటి, పాప్‌ గాయని జె న్నిఫర్‌ లోపెజ్‌. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అట్లాస్‌’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కృత్రిమ మేథతో రూపొందిన సైనికులతో  పొంచి ఉన్న ముప్పు నుంచి మానవాళిని అట్లాస్‌ ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘రాంపేజ్‌’ ఫేమ్‌ బ్రాడ్‌ పేటన్‌ దర్శకుడు. జోబీ హెరాల్డ్‌, టోనీ టన్నెల్‌ నిర్మాతలు. జెన్నిఫర్‌ లోపెజ్‌ ప్రస్తుతం ‘మ్యారీ మీ’, ‘షాట్‌గన్‌ వెడ్డింగ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Updated Date - 2021-06-17T10:36:19+05:30 IST