‘జెండా’ ఎగరేస్తాం.. : ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్
ABN, First Publish Date - 2021-08-14T23:15:43+05:30
‘మా’ ఎన్నికలపై చర్చలు మొదలైనప్పటి నుంచి.. ప్రకాష్ రాజ్ ఏ ట్వీట్ చేసినా.. అది వైరల్ అవుతూనే ఉంది. ఆయన ‘మా’ని ఉద్దేశించి చేస్తున్నారో.. లేక మరో రకంగా ఏదైనా కారణంతో చేస్తున్నారో తెలియదు కానీ.. ఆయన చేసే ట్వీట్స్
‘మా’ ఎన్నికలపై చర్చలు మొదలైనప్పటి నుంచి.. ప్రకాష్ రాజ్ ఏ ట్వీట్ చేసినా.. అది వైరల్ అవుతూనే ఉంది. ఆయన ‘మా’ని ఉద్దేశించి చేస్తున్నారో.. లేక మరో రకంగా ఏదైనా కారణంతో చేస్తున్నారో తెలియదు కానీ.. ఆయన చేసే ట్వీట్స్ ‘మా’కి రిలేటెడ్ అన్నట్లుగానే ఉంటున్నాయి. తాజాగా ఆయన ‘జెండా ఎగరేస్తాం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆగస్ట్ 15, స్వాతంత్ర్య దినోత్సవంను ఉద్దేశించి చేశారో.. లేక జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం అనే అర్థం వచ్చేలా చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఈ ట్వీట్‌పై టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి.
ఇక ‘మా’కు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు. ఒకవైపు ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ అంతా క్లియర్‌గా ఉందని చెబుతున్నారు. మరో వైపు రాబోయే ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న హేమ వంటి వారు నరేష్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంకో వైపు మెగాస్టార్ చిరంజీవితో పాటు దాదాపు 100కి పైగా ‘మా’ మెంబర్స్ వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ డీఆర్‌సీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి గందరగోళ వాతావరణంలో ప్రకాష్ రాజ్ చేసే ట్వీట్స్ మరింతగా వేడి రాజేస్తున్నట్లుగా అనిపిస్తున్నాయనడంలో సందేహమే లేదు. కాగా, ప్రకాష్ రాజ్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్ కారణంగా శస్త్ర చికిత్స ముగించుకుని.. ప్రస్తుతం హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయినట్లుగా తెలుస్తోంది.