Jayanthi: జయంతికి కలిసి రాని రెండు విషయాలు
ABN, First Publish Date - 2021-07-26T19:04:01+05:30
నటిగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తూ రాణించిన జయంతికి జీవితంలో రెండు విషయాలు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇంతకూ ఆమెకు కలిసి రాని విషయాలేంటో తెలుసా.. వివాహబంధం, రాజకీయాలు...
సీనియర్ నటి జయంతి అనారోగ్య సమస్యతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. మూడు వందల చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండు వందలకు పైగా.. అంటే ఐదు వందలకు పైగా దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమెను స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లిన సినిమా ‘మిస్ లీలావతి’. 1965లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. బోల్డ్ కంటెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో తన గ్లామర్‌తో జయంతి సొబగులు అద్దారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో జయంతి స్విమ్ సూట్ లో కనిపించడం సెన్సేషన్ అయ్యింది. ఒక దక్షిణాది హీరోయిన్ అలాంటి కాస్ట్యూమ్ తో కనిపించడం అదే ప్రథమం. నటిగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తూ రాణించిన ఆమెకు జీవితంలో రెండు విషయాలు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇంతకూ ఆమెకు కలిసి రాని విషయాలేంటో తెలుసా.. వివాహబంధం, రాజకీయాలు...
వివాహం విషయానికి వస్తే..జయంతి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి భర్త నటుడు, దర్శకుడు పెకేటి శివరాం. ఆమె రెండో భర్త నిర్మాత బండారు గిరిబాబు. తనకంటే చిన్నవాడు, తన కొడుకు స్నేహితుడు రాజశేఖర్‌ను మూడో పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లి జరిగే నాటికి జయంతికి 34 ఏళ్లు, రాజశేఖర్ కు 22 ఏళ్లు. తన భర్త హీరోగా రెండు చిత్రాలు కూడా నిర్మించారామె. అలాగే భర్త రాజశేఖర్ నటించిన విజయ్ చిత్రానికి తనే దర్శకత్వం వహించారు జయంతి. అయితే పెళ్లయిన మూడేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఓసారి మాత్రమే జయంతి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో లోక్ సత్తా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు.