‘రైస్‌ పుల్లింగ్‌ కలశం’ అంటూ మోసం.. నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-03-19T00:13:03+05:30 IST

'బ్లఫ్‌మాస్టర్‌' సినిమా గుర్తుందా? ఆ సినిమాలో సత్యదేవ్‌ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి అయితే.. ఈ చిత్ర దర్శకుడిని ఇంటికి పిలిపించుకుని

‘రైస్‌ పుల్లింగ్‌ కలశం’ అంటూ మోసం.. నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్‌

'బ్లఫ్‌మాస్టర్‌' సినిమా గుర్తుందా? ఆ సినిమాలో సత్యదేవ్‌ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి అయితే.. ఈ చిత్ర దర్శకుడిని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. ఈ సినిమాలో ఎదుటి మనిషిని ఈ విధంగా మోసం చేయవచ్చో.. దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు. మోసం చేసే పాత్రలో సత్యదేవ్‌ నటన నిజంగా అద్భుతం అనే చెప్పవచ్చు. ఆ సినిమాలో లాస్ట్‌లో రైస్‌ పుల్లింగ్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. ఆ సినిమాలో ఈ ఎపిసోడ్‌ ఎలా అయితే ఉంటుందో.. సేమ్‌ టు సేమ్‌ ఇప్పుడు రియల్‌లో కూడా ఓ నటుడు ఓ వ్యక్తిని అలానే మోసం చేశాడు. ఎవరా నటుడు? ఆ నటుడి చేతిలో మోసపోయిన వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలంటే.. పూర్తి కథనం చదవాల్సిందే.


సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌.. నటుడిగా పలు చిత్రాలలో నటించారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రూ. 26 కోట్లకు నటుడు అమ్రేష్‌ మోసం చేశాడనే విషయం తెలిసి.. కోలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ప్రస్తుతం అమ్రేష్‌ను ఇదే విషయమై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు. 


అమ్రేష్‌ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్‌ను రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట. రైస్‌ పుల్లింగ్‌ కలశం అని చెప్పి, అది ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుపుతూ.. 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ.. ఇప్పటి వరకు రూ. 26 కోట్లను నెడుమారన్‌ నుంచి వసూలు చేశారట. రైస్‌ పుల్లింగ్‌ కలశం ఇంటిలో పెట్టుకున్నా.. ఎటువంటి మార్పు లేకపోవడంతో.. వెంటనే నెడుమారన్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అమ్రేష్‌ను, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్‌ అంతా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.



Updated Date - 2021-03-19T00:13:03+05:30 IST