సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'జాతి రత్నం' చిట్టి అస్సలు ఊహించలేదట..!

ABN, First Publish Date - 2021-03-20T19:40:12+05:30

ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో ఒక్కోసారి మేధావులు కూడా చెప్పలేరు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆదరించే ప్రేక్షకుల చేతిలో రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా గనక ప్రేక్షకులను మెప్పిస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో ఒక్కోసారి మేధావులు కూడా చెప్పలేరు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆదరించే ప్రేక్షకుల చేతిలో రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా గనక ప్రేక్షకులను మెప్పిస్తే అందులో ముందుగా పేరొచ్చేది తెర మీద సందడి చేసిన వాళ్ళకే. మొదటి సినిమా సక్సస్ అన్నది ప్రతీ ఒక్కరి కెరీర్‌కి చాలా ముఖ్యం. ఈ సినిమా సక్సస్ మీద ఆ తర్వాత కెరీర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండగానే సూపర్ హిట్ అవుతుందని.. ఇండస్ట్రీ రికార్డ్ అని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉంటారు. అలాగే ఈ సినిమా జనాలకి ఎక్కకపోవచ్చన్న అనుమానాలు చోటుచేసుకున్న సందర్భాలుంటాయి. అయితే ఇక్కడ హిట్ అన్న సినిమా యావరేజ్‌గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. హిట్ అనుకున్న సినిమా అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలైతే హిట్ అవుతుంది.. పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందనుకుంటారు గానీ 'జాతి రత్నాలు' సినిమాల మాదిరిగా సంచలన విజయం అందుకుంటుందని మాత్రం అనుకునే సందర్భాలు చాలా తక్కువ. 


'మహానటి' సినిమాతో దశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. స్వప్న సినిమా బ్యానర్‌లో 'జాతి రత్నాలు' సినిమాని నిర్మించాడు. నవీన్ పొలి శెట్టి, ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు మరో అమ్మాయి నటించింది. తనే చిట్టి. జాతి రత్నాలు సినిమాతో చిట్టిగా పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పలు నిర్మాణ సంస్థలలో చిట్టి పేరు బాగా వినిపిస్తోంది. జాతి రత్నాలు సినిమా సక్సస్‌లో చిట్టికి క్రెడిట్ బాగా దక్కింది. దాంతో తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయట. ఈ విషయంలో ఫరియా అబ్దుల్లా స్పందిస్తూ జాతి రత్నాలు సినిమాతో చిట్టికి ఇంతటి పేరు వస్తుందని ఏమాత్రం ఊహించలేదంటోంది. అదే మరి మిరాకిల్ అంటే. ఇలాంటి మిరాకిల్స్ చాలా తక్కువ మంది విషయంలో జరుగుతాయి. మొత్తానికి జాతి రత్నాలు సినిమా ఫరియా అబ్దుల్లాకి అద్భుతమైన లైఫ్ ఇచ్చింది.

Updated Date - 2021-03-20T19:40:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!