సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అనుష్కతో సినిమా తర్వాతే ‘జాతి రత్నాలు 2’

ABN, First Publish Date - 2021-05-11T10:17:37+05:30

‘జాతి రత్నాలు’ చిత్రంతో నవీన్‌ పోలిశెట్టి అండ్‌ కో ప్రేక్షకుల్ని నవ్వించారు. ఈ ఏడాది థియేటర్లలో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో అదొకటి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘జాతి రత్నాలు’ చిత్రంతో నవీన్‌ పోలిశెట్టి అండ్‌ కో ప్రేక్షకుల్ని నవ్వించారు. ఈ ఏడాది థియేటర్లలో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో అదొకటి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ తర్వాత నవీన్‌ పోలిశెట్టికి మరో విజయం అందించింది. ఇప్పుడు ‘జాతి రత్నాలు 2’ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అయితే, ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళడానికి సమయం పడుతుందని తెలిసింది. అనుష్కతో నవీన్‌ పోలిశెట్టి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దానిని ‘రారా కృష్ణయ్య’ ఫేమ్‌ మహేశ్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనుష్కతో నటించబోయే ఆ సినిమా పూర్తయిన తర్వాతే ‘జాతి రత్నాలు 2’ మొదలవుతుందని సమాచారం. ఈలోపు స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారు. నవీన్‌ పోలిశెట్టితో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ పాత్రలు ఇందులో ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.

Updated Date - 2021-05-11T10:17:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!