జాన్వీ కపూర్.. ఏమి అందమిది? మతిపోతోంది!

ABN , First Publish Date - 2021-11-09T04:05:54+05:30 IST

అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అస్సలు తగ్గేదేలే.. అన్నట్లుగా నెటిజన్ల మతి పోగోడుతోంది. గత కొన్ని రోజులుగా రకరకాల దుస్తుల్లో.. ఏం చూపిస్తే నెటిజన్లు నెత్తిన పెట్టుకుంటారో.. అవి దర్శనమిచ్చేలా జాన్వీ రచ్చ రచ్చ చేస్తుంది. సినిమాల

జాన్వీ కపూర్.. ఏమి అందమిది? మతిపోతోంది!

అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అస్సలు తగ్గేదేలే.. అన్నట్లుగా నెటిజన్ల మతి పోగోడుతోంది. గత కొన్ని రోజులుగా రకరకాల దుస్తుల్లో.. ఏం చూపిస్తే నెటిజన్లు నెత్తిన పెట్టుకుంటారో.. అవి దర్శనమిచ్చేలా జాన్వీ రచ్చ రచ్చ చేస్తుంది. సినిమాల పరంగా ఈ భామకి సరైన హిట్ ఇప్పటి వరకు పడకపోయినా.. ఇలా క్లీవేజ్ షోలతో మాత్రం బాలీవుడ్‌‌ని షేకాడిస్తోంది. ఒక్క బాలీవుడ్ అనే కాదు.. సౌత్ సినీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు జాన్వీకపూర్ గురించే మాట్లాడుకుంటోంది అంటే.. ఆమె సోయగాలు ఎలా చక్కిలిగిలి పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.


ఇప్పటి వరకు హీరోయిన్ మెటీరియల్ కాదు అనే వారు కూడా.. వావ్ అంటూ ఆమె కోసం క్యూ కట్టే విధంగా జాన్వీ అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాకు వదిలిన పిక్స్‌లో అయితే.. సాగ‌రక‌న్య భూమిపైకి వచ్చిందా! అనేలా మతిపోగేట్టే అందంతో మెరిసిపోతోంది. నెట్‌లో నార్మల్ పిక్స్ కనబడితేనే నిద్రమానేసే కుర్రకారు.. ఇప్పుడు అతిలోకసుందరి కూతురి అందాల పదునుకు అల్లాడిపోతున్నారు. అదే విషయం ఆమెకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ లేలేత అందాలతో ముందు ముందు జాన్వీ ఇంకెన్ని సంచనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూద్దాం.  Updated Date - 2021-11-09T04:05:54+05:30 IST