రామ్ చరణ్, సుకుమార్ కాంబోపై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , First Publish Date - 2021-12-28T14:01:45+05:30 IST

రామ్ చరణ్, సుకుమార్ కాంబోపై దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో విడుదలవబోతోంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోపై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రామ్ చరణ్, సుకుమార్ కాంబోపై దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో విడుదలవబోతోంది. ఈ నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రబృందం తాజాగా చెన్నైలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు. ఈ కార్యక్రమలో తన హీరోలు చరణ్, ఎన్టీఆర్‌ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చరణ్‌ను నేను ఎప్పుడు 'మై హీరో' అంటానని, ఏ ఒత్తిడి లేకుండా సెట్‌కి వస్తాడు. ఎప్పుడూ.. మీకేం కావాలి, దాన్ని నేను ఎలా చేయగలను.. అనే ఆలోచించే మెంటాలిటీ తనది. ఇలాంటి మెంటాలిటీని చరణ్‌లో తప్పా నేను ఇంకెవరిలోనూ చూడలేదని అన్నారు. అలాగే, చరణ్ - సుకుమార్ కాంబోలో వచ్చే కొత్త ప్రాజెక్ట్‌ గురించి రివీల్ చేశారు. ఈ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు తెలుసునన్న రాజమౌళి..దాన్ని ఇప్పుడు మాత్రం రివీల్ చేయనని అన్నారు. దాంతో చరణ్ - సుక్కూ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని అర్థమైపోయింది. ఇది తెలిసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

Updated Date - 2021-12-28T14:01:45+05:30 IST