సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salaar: అదిరిపోయిన జగ్గుభాయ్ లుక్

ABN, First Publish Date - 2021-08-23T16:27:20+05:30

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా 'సలార్‌'.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా 'సలార్‌'. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. సెకండ్ ఇన్నిగ్స్‌లో అద్భుతమైన పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు 'సలార్‌'లో కూడా ఓ మెస్మరైజింగ్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆయన 'రాజమనార్‌' పాత్రలో నటిస్తుండగా, మేకర్స్ తాజాగా లుక్‌ని విడుదల చేశారు.


హంబులే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రషాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇందులో శృతి హాసన్ ప్రభాస్‌కి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న 'సలార్‌'ను 2022 ఏప్రిల్‌లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక జగ్గుభాయ్ ఈ సినిమాతో పాటు 'టక్ జగదీశ్', 'మహా సముద్రం', 'రాధే శ్యాం', 'గని' వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.  



Updated Date - 2021-08-23T16:27:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!