సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సింగరాయ్‌.. సాంగుకు వేళాయె!

ABN, First Publish Date - 2021-11-01T06:44:36+05:30

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. నవంబరు 6న ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. కథానాయకుడి పాత్రని పరిచయం చేస్తూ సాగే గీతమిది. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్‌ చేస్తారు. ‘‘బెంగాలీ కుర్రాడిగా నాని నటించారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ కి మంచి స్పందన వచ్చింది.  దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. వీఎఫ్‌ఎక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమిద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.


Updated Date - 2021-11-01T06:44:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!