ఆఖరి నిమిషం వరకూ ఆసక్తిగా ఉంది

ABN , First Publish Date - 2021-10-18T09:44:28+05:30 IST

‘‘నాట్యం’ చూశా. ఆఖరి నిమిషం వరకూ ఆసక్తికరంగా సాగింది. అన్ని కోణాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ద్వారా కూచిపూడి నాట్యం, మన సంస్కృతి గొప్పదనాన్ని వెలికితెస్తున్న సంధ్యా రాజు గారిని ప్రోత్సహించేందుకు...

ఆఖరి నిమిషం వరకూ ఆసక్తిగా ఉంది

‘‘నాట్యం’ చూశా. ఆఖరి నిమిషం వరకూ ఆసక్తికరంగా సాగింది. అన్ని కోణాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ద్వారా కూచిపూడి నాట్యం, మన సంస్కృతి గొప్పదనాన్ని వెలికితెస్తున్న సంధ్యా రాజు గారిని ప్రోత్సహించేందుకు ఇక్కడికి వచ్చాను’’ అని రామ్‌ చరణ్‌ అన్నారు. కూచిపూడి నృత్యకారిణి సంధ్యా రాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకుడు. సీనియర్‌ నటి భానుప్రియ కీలకపాత్ర  పోషించారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘భరతనాట్యమే కాకుండా అన్ని రకాల భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. సంధ్యా రాజు ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు. సంధ్యా రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రూపూదిద్దుకోవడంలో తెర వెనుక చాలామంది కృషి ఉంది. రామ్‌ చరణ్‌ నాకు పదే ళ్లుగా సాయం చేస్తున్నారు. కరుణాకర్‌ పాటలు, శ్రవణ్‌ సంగీతం ‘నాట్యం’ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ‘తెలుగుదనం ఉన్న సినిమా తీశాం. కొత్తదనమున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని దర్శకుడు కోరారు. 


Updated Date - 2021-10-18T09:44:28+05:30 IST