బాలు సార్‌ని చూసిన ప్రతిసారీ అలా అనిపించేది : దేవిశ్రీ

ABN , First Publish Date - 2021-06-04T23:41:30+05:30 IST

బాలు సార్‌ని చూసిన ప్రతిసారీ అలా అనిపించేది అన్నారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్. గానగంధర్వుడు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు(జూన్ 4). ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు 'ఎస్పీ బాలుకు స్వరనీరాజనం' కార్యక్రమం ప్రారంభమైంది.

బాలు సార్‌ని చూసిన ప్రతిసారీ అలా అనిపించేది : దేవిశ్రీ

బాలు సార్‌ని చూసిన ప్రతిసారీ అలా అనిపించేది అన్నారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్. గానగంధర్వుడు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు(జూన్ 4). ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు 'ఎస్పీ బాలుకు స్వరనీరాజనం' కార్యక్రమం ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు దర్శక, నిర్మాతలు.. సంగీత దర్శకులు.. గాయనీ గాయకులు.. గేయ రచయితలు.. మా అసోషియేషన్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దేవీశ్రీప్రసాద్ బాలుగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ..నాన్నగారికి బాలు గారితో మంచి ప్రెండ్‌షిప్ ఉండేది. నేను చిన్నప్పటినుండి బాలుగారి పాటలు విని పెరిగాను. బాలుగారు ఇన్ని వేల పాటలు పాడారు, అన్నింటికంటే ముఖ్యంగా ఎన్నిరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేరో అందరికి తెలుసు. 


నేను చిన్నప్పటినుండి బాలుగారి పాటలే ఎక్కువగా వినేవాడిని. ముఖ్యంగా అప్పట్లో 'మహర్షి' సినిమాలోని సాంగ్స్ బాగా పాపులర్. బాలుగారితో నాకున్న అనుబంధం కంటే ఎక్కువ చనువు ఉండేది. నేను చేసిన మొదటి సాంగ్‌ను ఆయనతో పాడించడం నాకు మరచిపోలేని అనుభూతి. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన 'దేవి' సినిమాలో ఓ సాంగ్ ని ఫస్ట్ సాంగ్‌ను బాలుగారి స్టూడియోలో రికార్డ్ చేసాం. అప్పటికే బాలుగారిని డాడీతో చూస్తుండేవాణ్ణి. బాలుగారు మా ఇంటికి వస్తున్నారంటే పెద్ద పెద్ద కార్లు వచ్చేవి.. హంగామా ఉండేది.. అది నాకు చాలా ఎగ్జైట్‌గా ఉండేది. ఆ తరువాత ఆయనతో చాలా పాటలు పాడించాను. నా పాటల విషయంలో చాలా అభినందించేవారు. నాకు బాలుగారిని చూసినప్పుడల్లా సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది.. అలాగే చిరంజీవి గారు, కమల్ హాసన్. వాళ్ళను ఎప్పుడు చూసిన కొత్తగా అనిపిస్తుంది. బాలుగారు అంతే, అయనను ఎప్పుడు చూసిన కొత్తగానే కనిపిస్తారు. మా ఫ్యామిలీతో ఆయనకు చాలా అనుబంధం ఉండేది. గొప్ప గొప్ప వాళ్లలో ఓ చిన్నపిల్లాడు ఉంటాడు.. అది బాలుగారిలో చూసాను. ఆయన గ్రేట్ లెజెండరీ సింగర్. ఆయనతో పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అయనను నిజంగా మిస్ అవుతున్నాం. లవ్ యు బాలుగారు అన్నారు.

Updated Date - 2021-06-04T23:41:30+05:30 IST