'ఆర్ఆర్ఆర్' సీత పాత్ర పెరుగుతోంది..!
ABN, First Publish Date - 2021-03-20T21:51:08+05:30
ఈ మధ్య కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ అనుకున్నది కాస్త ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవుతోంది. అయిదు నిముషాల క్యారెక్టర్ కాస్తా అరగంట అవుతోంది. అభిమానుల్లో వారి వారి క్రేజ్‌ని దృష్ఠిలో పెట్టుకొని ముందు అనుకున్న సీన్స్‌కి
ఈ మధ్య కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ అనుకున్నది కాస్త ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవుతోంది. అయిదు నిముషాల క్యారెక్టర్ కాస్తా అరగంట అవుతోంది. అభిమానుల్లో వారి వారి క్రేజ్‌ని దృష్ఠిలో పెట్టుకొని ముందు అనుకున్న సీన్స్‌కి మరికొన్ని సీన్స్ జత చేసి పాత్ర నిడివిని పెంచేస్తున్నారు దర్శక, రచయితలు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రెండు భారీ సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఆ రెండు సినిమాలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య.. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టా చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ఆచార్య సినిమాలో రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ముందు ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ నిడివి 20 నుంచి 25 నిముషాలు మాత్రమే ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే మెగా అభిమానుల కోసం కొరటాల శివ చరణ్ పాత్ర నిడివి పెంచేందుకు మరికొన్ని అదనపు సన్నివేశాలను జత చేశాడు. దాంతో ముందు ఇచ్చిన డేట్స్ కంటే కూడా అదనంగా ఆచార్య సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సి వచ్చింది. భారీ మల్టీస్టారర్‌గా ఆచార్య సినిమా రూపొందిస్తున్నాడు కొరటాల. కాగా ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్.. చరణ్‌కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో కనిపించబోతున్న ఆలియా భట్ లుక్‌ని కూడా రీసెంట్‌గా రిలీజ్ చేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా పాత్ర నిడివి పెంచబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ఆలియా కోసం మరికొన్ని సీన్స్‌ని రాయించాడని.. ఇందుకోసం ఆలియా డేట్స్ కూడా అదనంగా అడిగినట్టు సమాచారం. ఆలియా భట్ కూడా అదనంగా డేట్లు సర్దుబాటు చేసేందుకు ఒప్పుకుందట. ఇక ఈనెలాఖరున చరణ్ - ఆలియా మీద ఒక సాంగ్‌తో పాటు ఈ అదనపు సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.