'తగ్గేదే.. లే' అంటున్న 'పుష్ప'
ABN, First Publish Date - 2021-04-08T02:23:01+05:30
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8.. ఈ సందర్భంగా 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. దాన్ని బేస్ చేసుకునే 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' టీజర్‌ను కట్ చేశారు. అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు వస్తుంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి విజిల్స్ ద్వారా సంజ్ఞలు ఇచ్చుకుంటూ తప్పించుకుంటారనేలా సన్నివేశంతో 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' టీజర్‌స్టార్ట్ అయ్యింది. గొర్రెలు, మేకలు మధ్యలో ఎర్ర చందనం దుంగలను కొంత మంది తరలించే సన్నివేశం కూడా ఉంది. అలాగే పోలీసులకు భయపడి ఎర్ర చందనం దుంగలను తీసుకెళ్లే కూలీలు భయపడి పారిపోవడం.. వంటి సన్నివేశాలతో పాటు సుబ్రహ్మణ్యస్వామికి కావడి తీసుకెళ్లే భక్తురాలి లుక్‌లో రష్మికను చూపించాడు సుకుమార్. వీటితోపాటు ఎర్ర చందనం దుంగలను రహస్యంగా నీటి ద్వారా తరలించే ఓ సీన్, భారీ లారీ యాక్షన్ చేజింగ్ సీన్‌ను ఈ టీజర్‌లో చూడొచ్చు. అలాగే బన్నీ చేసిన పుష్పకు ముసుగు వేసి కొందరు అతన్ని వెంబడిస్తూ చంపాలని చూడటం.. వారి నుంచి తప్పించుకోవడమే కాదు.. వారిని మట్టు బెట్టే సీన్స్‌ను కూడా ఈ టీజర్‌లో సుక్కు చూపించారు. మంచి యాక్షన్ సీన్స్‌తో పాటు చిత్తూరు యాసలో 'తగ్గేదే..లే" అని బన్నీ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ను చాలా ఆసక్తిని రేపుతోంది. ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం 'పుష్ప'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.