#RRR : సెన్సేషనల్ ఇంటర్వెల్ బ్లాక్
ABN, First Publish Date - 2021-12-29T16:33:51+05:30
ప్రస్తుతం అందరూ మాట్లాడుకొనే ఒకే ఒక సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఈ సినిమా. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను దర్శకుడు రాజమౌళి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ముంబై, చెన్నైల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.
ప్రస్తుతం అందరూ మాట్లాడుకొనే ఒకే ఒక సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఈ సినిమా. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను దర్శకుడు రాజమౌళి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ముంబై, చెన్నైల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో తారక్, చెర్రీల ఇంట్రో సీన్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఆ సీన్స్ సినిమాకే హైలైట్స్ గా మారతాయని తెగ ఊరించారు రాజమౌళి. అలాగే.. ఇందులోని ఇంటర్వెల్ బ్లాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు రాజమౌళి. అసలు ఆ సీన్ ను అభిమానులు అసలేమాత్రం ఊహించరని అంటున్నారు.
రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో ఇంటర్వెల్ బ్లాక్ ను తెరకెక్కించారట రాజమౌళి. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ సీన్ దాదాపు 16 నిమిషాలు సాగుతుందట. బ్రిటీష్ వారి అండర్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పనిచేస్తున్న రామ్ చరణ్, వారికి వ్యతిరేకంగా పోరాడే యన్టీఆర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడట. అప్పుడు ఈ ఇద్దరి మధ్య సెన్సేషనల్ ఫైట్ సీన్ ఉంటుందట. అందరినీ అబ్బుర పరిచే రీతిలో రాజమౌళి ఈ సీన్ ను డిజైన్ చేశారట. ఇందులో తారక్, చెర్రీలు సింహాల్లా పోట్లాడతారట. ఆ సీన్ ను బిగ్ స్ర్కీన్ పై చూసి తీరాలంటున్నారు. ఈ సీన్ కోసమైనా సినిమాను ఎప్పుడు చూద్దామా అన్నంత ఆత్రుతగా ఉన్నారు అభిమానులు. మరి ఆ సీన్ ను చూడాలంటే జనవరి 7 వరకూ ఆగాల్సిందే.