Induvadana trailer : మనిషికి, ఆత్మకి మధ్య అందమైన ప్రేమ
ABN , First Publish Date - 2021-12-28T21:33:51+05:30 IST
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ‘ఇందువదన’ అనే హారర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటిస్తోంది. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మాణంలో యం. శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ‘ఇందువదన’ అనే హారర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటిస్తోంది. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మాణంలో యం. శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ‘ఇందువదన’ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
అన్నయ్యా.. ఆత్మ, మనిషి కలిసుండగలవా? కలిసి ఉండలేవమ్మా.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి హీరో, అందమైన ఆత్మతో ప్రేమలో పడతాడని అర్ధమవుతోంది. అయితే ఆమె ఎందుకు ఆత్మగా మారిందనే విషయాన్ని ఇందులో చూపించారు. అలాగే.. సినిమాలో భయపెట్టే సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. హీరోయిన్ గ్లామర్ సీన్స్ కూడా కనువిందు చేస్తున్నాయి. కామెడీ హారర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో వరుణ్ స్నేహితులుగా మహేశ్ విట్టా, ధనరాజ్, పార్వతీశం నటిస్తున్నారు. ఇంకా రఘుబాబు, ఆలీ, సురేశ్ వాణి, వంశీకృష్ణ, దువ్వాసి మోహన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా వరుణ్ సందేశ్ మరో సక్సెస్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి.