‘ఇందువదన’కు దర్శకేంద్రుడి టచ్

ABN , First Publish Date - 2021-08-03T03:06:18+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఇందువదన’. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్.ఎస్.ఆర్ దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న

‘ఇందువదన’కు దర్శకేంద్రుడి టచ్

చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఇందువదన’. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్.ఎస్.ఆర్ దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడమే కాకుండా, సినిమాపై కూడా ప్రేక్షకులలో ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేసింది. అలాగే ఓ లిరికల్ సాంగ్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్‌ కూడా మంచి స్పందననే రాబట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 4, ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్‌ను దర్శకేంద్రుడు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.

Updated Date - 2021-08-03T03:06:18+05:30 IST