కిల్‌ బిల్‌ రీమేక్‌లో!

ABN , First Publish Date - 2021-06-23T06:08:49+05:30 IST

క్వింటిన్‌ టొరంటినో దర్శకత్వం వహించిన క్లాసిక్స్‌లో ‘కిల్‌ బిల్‌’ ఒకటి. ఇప్పుడీ ఆంగ్ల చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు....

కిల్‌ బిల్‌ రీమేక్‌లో!

క్వింటిన్‌ టొరంటినో దర్శకత్వం వహించిన క్లాసిక్స్‌లో ‘కిల్‌ బిల్‌’ ఒకటి. ఇప్పుడీ ఆంగ్ల చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. భారతీయ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు, చేర్పులు చేశారని ముంబై ఖబర్‌. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించనున్నారు. లాక్‌డౌన్‌లో ఆయన స్ర్కిప్ట్‌ పనుల్ని పూర్తి చేశారట. ఇందులో కృతీ సనన్‌ ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయట. ఆమెతో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నిర్మాత నిఖిల్‌ ద్వివేదీ చర్చలు జరుపుతున్నారు. హాలీవుడ్‌లో ఉమా థర్మన్‌ పోషించిన పాత్రను హిందీలో కృతీ సనన్‌తో చేయించాలనేది వాళ్ల ఆలోచన. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారట. తప్పకుండా నటిస్తానని దర్శక-నిర్మాతలకు మాటిచ్చారని తెలిసింది. రెండు మూడు చిత్రాల్లో యాక్షన్‌ సన్నివేశాలు చేసినప్పటికీ... ఇప్పటివరకూ కృతీ సనన్‌ పూర్తిస్థాయిలో యాక్షన్‌ రోల్‌ చేయలేదు. ‘కిల్‌ బిల్‌’ రీమేక్‌ ఆమెకు తొలి యాక్షన్‌ సినిమా అవుతుంది. కృతీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వాళ్లు ఎవరనేది త్వరలో తెలుస్తుంది.


Updated Date - 2021-06-23T06:08:49+05:30 IST