కొవిడ్ వారియర్స్ చేతుల మీదుగా..
ABN , First Publish Date - 2021-02-02T07:03:59+05:30 IST
‘‘కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ వైద్యశాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్ట్‌ల...

‘‘కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ వైద్యశాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్ట్‌ల చేతుల మీదుగా మా సినిమా పాటలను విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అని జగపతిబాబు అన్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని మొదటి పాటను డా.గురవారెడ్డి, రెండో పాటను పారిశుద్య కార్మికులు, మూడో పాటను డీసీపీ మద్దిపాటి శ్రీనివాసరావు, నాలుగో పాటను సీనియర్ జర్నలిస్ట్‌లు సాయిరమేశ్, నాగ్రేందకుమార్ విడుదల చేశారు. చివరి పాటను మంగళవారం గాయని గీతామాధురి కుమార్తె బేబీ ప్రకృతి విడుదల చేయనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబీ సహశ్రిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బీమ్స్ సిసిరోలియో