చిరంజీవి చేతుల మీదుగా...
ABN , First Publish Date - 2021-09-13T05:48:03+05:30 IST
సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోయిన్. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. చిరంజీవి చేతుల మీదుగా ఆదివారం సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది....

సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోయిన్. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. చిరంజీవి చేతుల మీదుగా ఆదివారం సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘వాడు రౌడీ... వాళ్ల నాన్న రౌడీ... వాళ్ల తాత రౌడీ’ అంటూ హీరో గురించి హీరోయిన్ నేహా శెట్టి బిల్డప్ ఇవ్వడం, విలన్లను సందీప్ కిషన్ చితక్కొట్టడం, సందీప్ రౌడీ అనే అంశం చుట్టూ రూపొందించిన వినోద సన్నివేశాలు ఆసక్తిగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘పక్కా వినోదాత్మక చిత్రమిది. ఈ నెల 17న థియేటర్లలో మేం నవ్వులతో దాడి చేయబోతున్నాం. ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్‌కు థాంక్స్’’ అని చిత్రబృందం తెలిపింది. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కోన వెంకట్ స్ర్కీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ సినిమా నిర్మించారు.