‘పుష్ప’లో... సమ్‌థింగ్‌ స్పెషల్‌

ABN , First Publish Date - 2021-11-16T06:00:58+05:30 IST

‘పుష్ప’లో సమంత ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై.. చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. ‘మా సినిమాలో సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది’ అంటూ అధికారికంగా...

‘పుష్ప’లో... సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘పుష్ప’లో సమంత ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై.. చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. ‘మా సినిమాలో సమంత ఓ స్పెషల్‌  సాంగ్‌ చేస్తోంది’ అంటూ అధికారికంగా ప్రకటించేసింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. డిసెంబరు 17న విడుదల కాబోతోంది. ‘‘పుష్పలో ఈ పాట ఎంతో ప్రత్యేకం. ఈ ప్రత్యేకమైన గీతానికి ఓ ప్రత్యేకమైన నటి కావాలనిపించింది. అందుకే సమంతని సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చేసింది’’ అని చిత్రబృందం ప్రకటించింది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Updated Date - 2021-11-16T06:00:58+05:30 IST