‘పాగల్‌’ పోరడు

ABN , First Publish Date - 2021-02-03T05:53:36+05:30 IST

‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న సంగీతభరిత ప్రేమకథా చిత్రం ‘పాగల్‌’. ఇందులో విశ్వక్‌సేన్‌ కథానాయకుడు...

‘పాగల్‌’ పోరడు

‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న సంగీతభరిత ప్రేమకథా చిత్రం ‘పాగల్‌’. ఇందులో విశ్వక్‌సేన్‌ కథానాయకుడు. మంగళవారం హీరో ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అలాగే, ఏప్రిల్‌ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘‘విశ్వక్‌ సేన్‌ లుక్‌కి అద్భుత స్పందన లభిస్తోంది. లుక్‌లోని గులాబీపూలు ప్రేమ, స్వచ్ఛతకు చిహ్నం అని చెప్పవచ్చు. ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నాం’’ అని చెప్పారు. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రధన్‌ సంగీత దర్శకుడు.

Updated Date - 2021-02-03T05:53:36+05:30 IST