‘ఫ్యామిలీ మ్యాన్-3’లో...?
ABN , First Publish Date - 2021-06-20T06:04:59+05:30 IST
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో రెండు సీజన్లు వచ్చాయి. రెండూ వీక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్-3’ ఉంటుందని ఈ వెబ్ షో క్రియేటర్లు...
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో రెండు సీజన్లు వచ్చాయి. రెండూ వీక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్-3’ ఉంటుందని ఈ వెబ్ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్-డీకే స్పష్టం చేశారు. కాన్సెప్ట్ సిద్ధంగా ఉంది కానీ కథపై కూర్చోవాలని చెప్పారు. అందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారని వినికిడి. వాస్తవానికి, ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో శ్రీలంకలోని తమిళ నాయకుడి పాత్రలో నటించాల్సిందిగా విజయ్ సేతుపతిని రాజ్-డీకే సంప్రదించారు. కానీ, ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు మూడో సీజన్‌లో మరో పాత్రలో నటించమని కోరగా, సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ముంబై వర్గాల భోగట్టా.