Lakshya: ఫస్ట్ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటున్న కేతిక శర్మ

ABN , First Publish Date - 2021-08-14T13:59:09+05:30 IST

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'లక్ష్య'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రబృందం. 'లక్ష్యాస్ ఫ్రైడే' అంటూ ప్రతీ శుక్రవారం ఈ చిత్రంకి సంబంధించిన ఓ అప్ డేట్ ఉంటుందని చెప్పిన మేకర్స్, ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ వదిలారు.

Lakshya: ఫస్ట్ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటున్న కేతిక శర్మ

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'లక్ష్య'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రబృందం. 'లక్ష్యాస్ ఫ్రైడే' అంటూ ప్రతీ శుక్రవారం ఈ చిత్రంకి సంబంధించిన ఓ అప్ డేట్ ఉంటుందని చెప్పిన మేకర్స్, ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. 'లక్ష్య'మూవీలో నాగ శౌర్యకి జంటగా యంగ్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తోంది. తాజాగా తన ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్‌లో విడుదల చేయగానే వైరల్ అవుతోంది. ఆకాష్ పూరి సరసన 'రొమాంటిక్' సినిమా ముందు పూర్తి చేసినప్పటికి 'లక్ష్య' సినిమానే కేతికకి  డెబ్యూ ప్రాజెక్ట్ అయింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 



Updated Date - 2021-08-14T13:59:09+05:30 IST