ఐదు భాషల్లో ‘ఇక్షు’

ABN , First Publish Date - 2021-07-22T03:53:14+05:30 IST

రామ్‌ అగ్నివేశ్‌, రాజీవ్‌ కనకాల, కాలకేయ ప్రభాకర్‌, రీతు, రేఖ కీలక పాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్షు’. బుషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్‌ గౌతమ్‌ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఐదు భాషల్లో ‘ఇక్షు’

రామ్‌ అగ్నివేశ్‌, రాజీవ్‌ కనకాల, కాలకేయ ప్రభాకర్‌, రీతు, రేఖ కీలక పాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్షు’. బుషిక  దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్‌ గౌతమ్‌ నాయుడు  నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఐదు  భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘కథ, కథనం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ స్పందన బావుంది. షూటింగ్‌ పూర్తయింది.  త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. 


Updated Date - 2021-07-22T03:53:14+05:30 IST