ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయాలనుకుంటాను

ABN , First Publish Date - 2021-10-18T09:43:16+05:30 IST

‘‘నా జీవితాన్ని పరిశీలించుకుంటూ... నేను అనుభూతి చెందిన అంశాలను కథలా రాసుకొని, వెండితెరపై ప్రేక్షకుల ముందుకు తేవాలనేదే నా ప్రయత ్నం. ‘బొమ్మరిల్లు’ నుంచి నేను తీసిన చిత్రాలకు...

ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయాలనుకుంటాను

‘‘నా జీవితాన్ని పరిశీలించుకుంటూ... నేను అనుభూతి చెందిన అంశాలను కథలా రాసుకొని, వెండితెరపై ప్రేక్షకుల ముందుకు తేవాలనేదే నా ప్రయత ్నం. ‘బొమ్మరిల్లు’ నుంచి నేను తీసిన చిత్రాలకు కథలు అలానే రూపొందాయి. చూసిన ఐదు నిమిషాలైనా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయాలనుకుంటాను. నా జీవితంతో పాటు అందరి జీవితాలు మెరుగవ్వాలని కొత్త కొత్త ఆలోచనలతో కథలు రాసుకుంటున్నాను’’ అని ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ అన్నారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ఇటీ వల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ చాలా బావుందని ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన చెప్పిన విశేషాలివీ...


ప్రతి పెళ్లిలోనూ ఫుల్‌ సెలబ్రేషన్స్‌ జరుగుతాయి. తర్వాత జీవితంలో ఎలా బ్రతకాలనే విషయంలో స్పష్టత ఉండదు. అందుకే పెళ్లి తర్వాత జీవితం ఆహ్లాదంగా మారాలంటే ఏం చేయాలనేది నాకున్న పరిమితుల్లో ప్రేక్షకులకు వినోదాత్మకంగా చెప్పాలని ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తీశా. 


యువత, పెద్దవాళ్లు ఫోన్‌ చేసి ‘సినిమా బాగా తీశావు’ అని ప్రశంసిస్తున్నారు. అరవింద్‌గారు, బన్నీవాసు, వాసూవర్మ సహకారం వల్లే ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో ప్రకటిస్తాను. 

Updated Date - 2021-10-18T09:43:16+05:30 IST