ఇది నా సినిమా అని చెప్పుకొనేలా ఉంటుంది
ABN, First Publish Date - 2021-12-30T06:02:45+05:30
‘‘ఒకే ఒక జీవితం’... ‘ఇది నా సినిమా’ అని నేను జీవితాంతం గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన హీరోగా శ్రీకార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’..
‘‘ఒకే ఒక జీవితం’... ‘ఇది నా సినిమా’ అని నేను జీవితాంతం గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన హీరోగా శ్రీకార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూవర్మ హీరోయిన్. ఎస్. ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడతూ ‘‘కథ వినగానే ‘అమలగారు చేస్తున్నారా’ అని అడిగాను. ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమలగారి పాత్ర’’ అన్నారు. అమల అక్కినేని మాట్లాడుతూ ‘ఈ సినిమాతో అందరికీ అమ్మయ్యాను. మిగిలిన సినిమాలు చేసినా చేయకపోయినా ఈ పాత్ర చాలు అనిపించింది’ అన్నారు. శ్రీకార్తిక్ మాట్లాడుతూ ‘‘అమ్మను చూడాలని రాసిన ఒక్క సీన్ అలా పెరుగుతూ ‘ఒకే ఒక జీవితం’ సినిమాగా మారింది. ఇది ఫీల్ గుడ్ సినిమా అవుతుంది’’ అన్నారు. ఈ సినిమా మనందరికి టచ్ అవుతుందని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పారు.