సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆయన దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌!

ABN, First Publish Date - 2021-01-18T10:41:54+05:30

‘‘మా ఆయన దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌. పెళ్లి తర్వాత మేం సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మా ఆయన దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌. పెళ్లి తర్వాత మేం సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. మంచి పాత్రల్లో నటించాలనుకుంటున్నా. ఒకే తరహా పాత్రలకు పరిమితం అవ్వాలనుకోవడం లేదు. నాకు డ్యాన్స్‌ చేయడం ఇష్టం. ప్రత్యేక గీతాలు, గ్లామర్‌ పాత్రలు చేయడం వల్ల అవకాశాలు తగ్గుతాయని అనుకోను’’ అని అర్చన అన్నారు. బాలదిత్యకు జంటగా ఆమె నటించిన ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ ‘‘సినిమాలో ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశా. వైద్య విద్యార్థినిగా మొదలై, ప్రేమ పెళ్లి చేసుకోవడం వరకూ ఉంటుంది. సమాజంలో పరువు హత్యలను దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు నా పాత్ర ద్వారా ప్రస్తావించారు. నటనకు ఆస్కారమున్న పాత్ర చేశా. చిన్నతనంలో అన్నపూర్ణమ్మ, జమునగారి చిత్రాలు చూశా. వాళ్లతో నటించడం సంతోషంగా ఉంది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. కె. విశ్వనాథ్‌గారు చూసి బావుందని ప్రశంసించారు’’ అని చెప్పారు.


Updated Date - 2021-01-18T10:41:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!