'శ్యామ్ సింగ రాయ్': హిందీ రీమేక్ ఆ స్టార్ హీరోతోనే..!

ABN , First Publish Date - 2021-11-09T18:02:16+05:30 IST

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని బాలీవుడ్ స్టార్ హీరోతో రీమేక్ చేస్తారట.

'శ్యామ్ సింగ రాయ్': హిందీ రీమేక్ ఆ స్టార్ హీరోతోనే..!

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని బాలీవుడ్ స్టార్ హీరోతో రీమేక్ చేస్తారట. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు సౌత్‌లోని భాషలలో తప్ప బాలీవుడ్‌లో రిలీజ్ చేసే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్టు తెలుస్తోంది. 'శ్యామ్ సింగ రాయ్' మూవీని హిందీలో రీమేక్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే హృతిక్ రోషన్ ఇందులో హీరోగా నటించే అవకాశాలున్నట్టు నాని ఇటీవల చెప్పుకొచ్చాడు. త్వరలో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని తెలిపాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 24న భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, నిహారికా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలలో ఇదే హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.

Updated Date - 2021-11-09T18:02:16+05:30 IST