సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'శ్యామ్ సింగ రాయ్': ఆకట్టుకుంటున్న 'సిరివెన్నెల' వీడియో సాంగ్..

ABN, First Publish Date - 2021-12-29T14:47:31+05:30

'శ్యామ్ సింగ రాయ్' చిత్రం నుంచి తాజాగా 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట 'సిరివెన్నెల' వీడియో సాంగ్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఇందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'శ్యామ్ సింగ రాయ్' చిత్రం నుంచి తాజాగా 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట 'సిరివెన్నెల' వీడియో సాంగ్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన 'శ్యామ్ సింగ రాయ్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్న 'సిరివెన్నెల' అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ సాంగ్..ఇప్పుడు యూట్యూబ్‌లోనూ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. 



Updated Date - 2021-12-29T14:47:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!