ఆహాలో 'గాలి సంపత్‌'కి భారీ క్రేజ్..!

ABN , First Publish Date - 2021-03-20T21:38:23+05:30 IST

కొన్ని సినిమాల మీద రిలీజ్‌కి ముందు నుంచి భారీగా అంచనాలు ఏర్పడతాయి. కొన్ని సినిమాలు మీద అసలు అంచనాలే ఉండవు. అయితే అంచనాలున్న సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందని చెప్పలేము. ఎలాంటి అంచనాలు లేకుండా

ఆహాలో 'గాలి సంపత్‌'కి భారీ క్రేజ్..!

కొన్ని సినిమాల మీద రిలీజ్‌కి ముందు నుంచి భారీగా అంచనాలు ఏర్పడతాయి. కొన్ని సినిమాలు మీద అసలు అంచనాలే ఉండవు. అయితే అంచనాలున్న సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందని చెప్పలేము. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన సినిమాకి ప్రేక్షల నుంచి ఆదరణ ఉండదనీ చెప్పలేము. అందుకు ఉదాహరణ మార్చ్ 11న మహా శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చిన సినిమాలే. మొత్త మూడు సినిమాలు మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు చిన్న సినిమాలే. స్వప్న సినిమా బ్యానర్‌లో నిర్మించిన జాతి రత్నాలు, శర్వానంద్ నటించిన శ్రీకారం, నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ - శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్. అయితే ఏదో ఒక రకంగా రిలీజ్‌కి ముందు ఈ మూడు సినిమాలకి ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ ఏర్పడింది.


కానీ భారీ హిట్ సాధించింది మాత్రం జాతి రత్నాలు. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీగా వసూళ్ళు రాబట్టింది. కానీ మిగతా రెండు సినిమాలు ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇది సాధారణంగా జరిగేదే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరుస్తుంటాయి. అయితే బుల్లితెర మీద మాత్రం ప్రేక్షకాధరణ విపరీతంగా ఉంటుంది. అలా ఇప్పుడు గాలి సంపత్ సినిమాకి ఆదరణ దక్కుతోందట. థియోటర్ రిలీజైన ఎనిమిది రోజులకే గాలిసంపత్ ఆహాలో విడుదలైంది. సిల్వర్ స్క్రీన్ మీద కాస్త డల్‌గా అనిపించినప్పటికీ ఆహాలో మాత్రం మంచి రిజల్ట్‌ని రాబడుతోంది గాలి సంపత్. 

Updated Date - 2021-03-20T21:38:23+05:30 IST