హారర్ కామెడీ
ABN , First Publish Date - 2021-12-30T06:03:31+05:30 IST
రాశీ ఖన్నా కథానాయికగా నటించిన ‘అంతఃపురం’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. తమిళంలో హిట్ అయిన ‘అరణ్మణై 3’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు...

రాశీ ఖన్నా కథానాయికగా నటించిన ‘అంతఃపురం’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. తమిళంలో హిట్ అయిన ‘అరణ్మణై 3’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఆండ్రియా మరో కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు కూడా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై విజయం సాధించాయి. అలాగే ‘అంతఃపురం’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. విజువల్‌గా హై స్డాండర్డ్స్‌లో ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు. సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ఇతర ముఖ్య పాత్రలు పోఫించారు.