సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అడివి శేష్‌ హీరోగా 'హిట్‌ 2'.. లాంఛనంగా ప్రారంభం

ABN, First Publish Date - 2021-03-20T16:58:58+05:30

హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా 'హిట్ ‌2' చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్‌ చేసినట్టుగానే శనివారం 'హిట్‌ 2' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా అ! సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ కొట్టారు. రెండో చిత్రంగా 'హిట్‌' అనే సీట్‌ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్‌ డూపర్ హిట్‌ సాధించారు. రీసెంట్‌గా హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా 'హిట్ ‌2' చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్‌ చేసినట్టుగానే శనివారం 'హిట్‌ 2' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ' ది సెకండ్‌ కేస్‌' సినిమా ట్యాగ్‌లైన్‌. హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే హిట్‌ 2 సినిమా రూపొందనుంది. 


అడివిశేష్‌ కథానాయకుడుగా కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో నటిస్తున్న 'హిట్‌ 2' రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. 

Updated Date - 2021-03-20T16:58:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!