హిందీ ‘హిట్‌’ షురూ

ABN , First Publish Date - 2021-09-13T05:42:06+05:30 IST

రాజ్‌కుమార్‌ రావ్‌, సాన్యా మల్హోత్రా జంటగా టీ-సిరీస్‌, ‘దిల్‌’రాజు ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘హిట్‌ - ద ఫస్ట్‌ కేస్‌’. తెలుగులో విష్వక్‌సేన్‌ నటించిన థ్రిల్లర్‌ ‘హిట్‌’కు రీమేక్‌ ఇది....

హిందీ ‘హిట్‌’ షురూ

రాజ్‌కుమార్‌ రావ్‌, సాన్యా మల్హోత్రా జంటగా టీ-సిరీస్‌, ‘దిల్‌’రాజు ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘హిట్‌ - ద ఫస్ట్‌ కేస్‌’. తెలుగులో విష్వక్‌సేన్‌ నటించిన థ్రిల్లర్‌ ‘హిట్‌’కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన డా. శైలేష్‌ కొలను హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హీరో, దర్శకుడితో పాటు నిర్మాతలు ‘దిల్‌’ రాజు, భూషణ్‌కుమార్‌, కుల్‌దీప్‌ రాథోడ్‌ పూజలో పాల్గొన్నారు. త్వరలో చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.


Updated Date - 2021-09-13T05:42:06+05:30 IST