సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'రామారావు ఆన్‌డ్యూటీ'లో జాయిన్ అయిన హీరోయిన్స్

ABN, First Publish Date - 2021-07-19T16:38:56+05:30

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఇందులో నటిస్తున్న ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ షూటింగ్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఇందులో నటిస్తున్న ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ షూటింగ్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. రవితేజ 68గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా, స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే ఒక హీరోయిన్‌గా మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్ ఎంపికయింది. తాజాగా రజీష విజయన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్టు మేకర్స్ తెలిపారు. ఈమె పలు మలయాళ హిట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక 'రామారావు ఆన్‌డ్యూటీ' మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. కాగా రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న 'ఖిలాడి' చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.

Updated Date - 2021-07-19T16:38:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!