సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’: సమంత

ABN, First Publish Date - 2021-09-18T16:18:53+05:30

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియావారు తాజాగా చైతూ-సమంతలపై వినిపిస్తోన్న రూమర్స్ గురించి ప్రశ్నించగా.. దానికి ఆమె 'గుడికి వచ్చి.. బుద్ధుందా?'.. అంటూ సమాధానమిచ్చారు.


సాధారణంగా తిరుమలకు వచ్చే సెలబ్రిటీలు మీడియా వారికి బైట్స్ ఇవ్వడం, కొద్దిసేపు మాట్లాడటం.. అలాగే కెమెరాలకి స్టిల్స్ ఇవ్వడమూ చేస్తుంటారు. ఈ విధంగానే మీడియావారు సమంతను మాస్క్ తీసి వినిపిస్తున్న గాసిప్స్‌పై చిన్న బైట్ అడిగారు. కానీ ఆమె ఇలా రియాక్టయి షాకిచ్చారు. కాగా, ఈ మధ్య సమంత - నాగ చైతన్య విడిపోతున్నారంటూ, అందుకే ఎక్కడికెళ్ళినా ఎవరికి వారు ఒంటరిగానే కనిపిస్తున్నారంటూ వార్తలు టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా శ్రీవారి దర్శనార్ధం ఆమె తిరుమలకు ఒంటరిగానే రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.

Updated Date - 2021-09-18T16:18:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!