అందుకే నా సినిమాలు చూడను: సూర్య
ABN , First Publish Date - 2021-02-02T16:35:38+05:30 IST
మంచి నటుడిగా తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సూర్య.

మంచి నటుడిగా తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సూర్య. ఆయన నటించిన సినిమాలకు రెండు భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. సూర్య ఇటీవల నటించిన `ఆకాశం నీ హద్దురా` సినిమా రెండు భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఓ టాక్ షోకు హాజరైన సూర్య తన సినిమాల గురించి, తన నటన గురించి మాట్లాడాడు.
`నా భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి తమ సినిమాల విషయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ, నేనలా ఉండలేను. రెండు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నా నా సినిమాల విషయంలో నేను కాన్ఫిడెంట్‌గా ఉండలేను. నా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తే అది వారి పెద్ద మనసు అనుకుంటాను. నా సినిమాల విషయంలో, నా నటన విషయంలో నేను చాలా కఠినంగా ఉంటాను. నా సినిమాలను వంద రోజులు దాటిన తర్వాతే చూస్తుంటాను. కొన్ని సీన్లలో నా నటన చూసి సిగ్గుపడుతుంటాన`ని సూర్య చెప్పాడు.