‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ తల్లిదండ్రుల పాత్రలలో ఎవరంటే?

ABN , First Publish Date - 2021-08-19T22:17:44+05:30 IST

పుట్టిన‌రోజు (ఆగస్ట్ 19) సంద‌ర్భంగా తను హీరోగా నటిస్తోన్న ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రంలో తనకు తల్లిదండ్రులుగా నటిస్తున్న పాత్రలను హీరో సుహాస్ రివీల్ చేశారు. ‘క‌ల‌ర్‌ఫోటో’ చిత్రంతో హీరోగా తొలి స‌క్సెస్ అందుకున్న

‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ తల్లిదండ్రుల పాత్రలలో ఎవరంటే?

పుట్టిన‌రోజు (ఆగస్ట్ 19) సంద‌ర్భంగా తను హీరోగా నటిస్తోన్న ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రంలో తనకు తల్లిదండ్రులుగా నటిస్తున్న పాత్రలను హీరో సుహాస్ రివీల్ చేశారు. ‘క‌ల‌ర్‌ఫోటో’ చిత్రంతో హీరోగా తొలి స‌క్సెస్ అందుకున్న సుహాస్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్’. మ‌నోహర్ గోవింద స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్ ప‌తాకాల‌పై అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రంలో సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి నటిస్తుండగా, తల్లి పాత్రలో రోహిణి నటిస్తోంది. వీరిద్దరి కలయికలో ఉన్న పోస్టర్‌ని చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2021-08-19T22:17:44+05:30 IST